ముందస్తు స్క్రీనింగ్, అత్యాధునిక చికిత్సలు అవసరం…
గ్రేటర్ న్యూస్, హనుమకొండ : ఒకప్పుడు ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే కేవలం ధూమపానానికి మాత్రమే సంబంధించిందని భావించేవారు. కానీ, ప్రస్తుతం ధూమపానం చేయని వారిలో, యువతలో కూడా ఈ వ్యాధి ఎక్కువగా నిర్ధారణ అవుతుండటం వైద్య నిపుణులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోందని సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ డాక్టర్(కన్సల్టెంట్-సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్, హెమటో-అంకాలజిస్ట్) కంచర్ల హరీష్ తెలిపారు. గురువారం హనుమకొండ నక్కల గుట్ట లోని యశోద హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కంచర్ల హరీష్ మాట్లాడుతూ “ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగుల ప్రొఫైల్లో గణనీయమైన మార్పును మేము చూస్తున్నామని ధూమపానం చేయని వారు,యువకులు కూడా ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారన్నారు.ముఖ్యంగా వంశపారంపర్య క్యాన్సర్లలో జన్యుపరమైన కారకాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎన్జీ ఎస్ (NGS), పీసీఆర్ (PCR) వంటి
అధునాతన నిర్ధారణ పద్ధతులు, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ వంటి చికిత్సలు అందుబాటులోకి
రావడంతో, మేము ఇప్పుడు మరింత వ్యక్తిగతీకరించిన, సమర్థవంతమైన చికిత్సలను అందించగలుగుతున్నామని అన్నారు.ముఖ్యంగా, సాధారణ రక్త పరీక్షల ద్వారా ముందస్తు స్క్రీనింగ్ చేయడం వలన లక్షణాలు కనిపించకముందే ముప్పు పొంచి ఉన్న వ్యక్తులను గుర్తించవచ్చని తెలిపారు.ఇది చికిత్స ఫలితాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది.” అని అన్నారు. సమగ్రమైన, వ్యక్తిగతీకరించిన చికిత్సను అందించడానికి అత్యాధునిక సాంకేతికతలను నిపుణులైన క్లినికల్ నైపుణ్యంతో సమన్వయం చేస్తూ యశోద హాస్పిటల్స్ క్యాన్సర్ సంరక్షణలో అగ్రగామిగా కొనసాగుతోందని తెలిపారు.వంశపారంపర్య క్యాన్సర్ల పట్ల అవగాహన పెంచాలని హాస్పిటల్ సూచిస్తోందని కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్న వ్యక్తులు సకాలంలో స్క్రీనింగ్, జన్యుపరమైన కౌన్సెలింగ్ చేయించుకోవాలని సూచించారు. ముందస్తు గుర్తింపు, నివారణలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
మరింత సమాచారం కోసం ఈయొక్క నెంబర్ ను 7337356726 సంప్రదించగలరని తెలిపారు. ఈ సమావేశంలో ఆసిస్టెంట్ మేనేజర్ రమేష్,మార్కెటింగ్ మేనేజర్ రాజ్ నాయక్ మిశ్రా,సిబ్బంది పాల్గొన్నారు.

