చెట్టు మీద నుండి జరిపడి మంచానికే పరిమితమైన బాలిక
సంవత్సరం నుండి నరకం అనుభవిస్తున్న బాలిక
ఆపన్న హస్తాల కోసం ఎదురుచూపు
గ్రేటర్ న్యూస్,జనగామ : జిల్లాలోని పాలకుర్తి మండలం వావిలాల గ్రామానికి చెందిన చిలకాని ఎల్లయ్య ఐలమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురుకి వివాహం కాగా మిగిలిన ముగ్గురు చదువుకుంటున్నారు. చిన్న కుమార్తె శ్రావణి పొలం దగ్గర ఉన్న మునిగా కాయల కోసం చెట్టు ఎక్కగా జారి కింద పడింది. ఈ ఘటనలో శ్రావణి కి వెన్నుపూసకు తీవ్ర గాయాలు అయినవి . నీమ్స్ కు తీసుకెళ్లి వెన్నుపూసకు సర్జరీ చేయించి సంవత్సరమైనా కూడా నరాలు చచ్చుబడి పోయి మంచం మీద నుండి లేవ లేని దయనీయ స్థితిలో ఉన్నది. పేదవారైన శ్రావణి తల్లిదండ్రులు ఆమె చికిత్స కోసం వారికి ఉన్న అర్ధ ఎకరం పొలం అమ్మి ఖర్చుపెట్టిన కూడా ఫలితం లేకుండా పోయింది. ఎనిమిదో తరగతి వరకు చదువుకున్న శ్రావణి తాను అందరిలాగే పాఠశాలకు వెళ్లి చదువుకోవాని ఉన్నదని, అందరి లాగా నేను నడవాలని ఉందని తన ఆవేదన వ్యక్తం చేసింది. ఆడపిల్లగా తన బాధను ఎవరికీ చెప్పుకోలేకపోతున్నానని నడవలేని దయనియస్థితిలో ఉన్నానని ఎవరైనా దాతలు ఉండే తన వైద్యం కు ఆర్థిక సహాయం చేయగలరని ప్రాధేయపడింది. శ్రావణి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు రోజువారిగా కూలి పనులకు వెళుతూ శ్రావణకి వైద్యం చేస్తున్నామని ఎవరైనా దాతలు ఉంటే తమ బిడ్డను ఆదుకోవాలని తమ ఆవేదన వ్యక్తం చేశారు.

