తల్లి ఆశీర్వాదాలు తీసుకున్న డీజీపీ సీవీ ఆనంద్…

గ్రేటర్ న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా తన తల్లిని కలిసి ఆశీర్వాదాలు పొందారు.  తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలిపారు. తన కుమారుడు డీజీపీగా బాధ్యతలు చేపట్టడం చూడాలన్న తల్లి కోరికే ఆమెను కోలుకునేలా చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. కుమారుడి ఉన్నత పదవిని చూసి తల్లి ఆనందించగా, తాను కూడా అదే స్థాయిలో సంతోషం వ్యక్తం చేసినట్లు డీజీపీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *