వరంగల్ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ నియామకం…

గ్రేటర్ న్యూస్, వరంగల్ : వరంగల్ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీని 10 మంది సభ్యులతో ఏర్పాటు చేశారు. రాష్ట్ర సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ సిహెచ్ ప్రియాంక ఈ మేరకు శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీకి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద చైర్మన్ గా ఉంటారు. సభ్యులుగా శ్రీరామ్ రామచందర్, మెండు రవీందర్, దొంతు నవీన్, ఎండి హుస్సేన్ పాషా, మట్టా దుర్గాప్రసాద్, కోదాటి గోపాలకృష్ణ, పల్లెల్ల సోమేశ్వరరావు, పెద్దపల్లి వరప్రసాద్, బొడిగ శ్రీనివాస్, బొల్లెపల్లి రాజు సభ్యులుగా నియమిస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు ఈ కమిటీకి జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి ఆయుబ్ అలీ మెంబర్ కన్వీర్ గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో దక్షిణ మధ్య రైల్వే, టీ జి ఎస్ ఆర్ టి సి ప్రతినిధులు, సమాచార శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. కొత్తగా ఏర్పడిన నూతన కమిటీ తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *