Breaking
16 Jul 2026, Thu

అక్రిడిటేషన్ కమిటీ సభ్యులుగా ఐజేయూ నుండి ఐదుగురు నియామకం…

గ్రేటర్ న్యూస్, హనుమకొండ : హనుమకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రకటించారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉంటూ, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నుండి ఐదుగురిని నియమించారు. ఐజేయూ నుంచి గడ్డం కేశవమూర్తిని నియమించారు. అలాగే బిగ్ మీడియా నుంచి కంకణాల సంతోష్, మీడియం డెయిలీ నుంచి నల్లాల బుచ్చిరెడ్డి, చిన్న పత్రికల నుంచి గాడిపెల్లి మధు, వీడియో జర్నలిస్టు నుంచి బోళ్ల అమర్ ను నియమించారు. వీరితో పాటు ఇతర యూనియన్ ల నుండి నలుగురు, డీపీఆర్ఓ, ఆర్టీసీ, సౌత్ సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అధికారులు సభ్యులుగా ఉండనున్నారు.ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నుండి గరిష్ఠంగా ఐదుగురిని ఎంపిక చేయడం పట్ల ఐజేయూ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *