Breaking
30 Aug 2026, Sun

మామునూరు విమానాశ్రయం  హద్దులు నిర్ణయించిన ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్…

గ్రేటర్ న్యూస్,వరంగల్: మామునూరు విమానాశ్రయం అభివృద్ధి పనుల నేపథ్యంలో కొత్తగా భూసేకరణ చేసి హద్దులు నిర్ణయించిన ప్రాంతాన్ని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం పరిశీలించారు.అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి మామునూరు విమానాశ్రయానికి సంబంధించిన భూసేకరణ ప్రాంతంలో పర్యటించిన కలెక్టర్, కొత్తగా సేకరించిన భూముల సర్వే నంబర్లు, నిర్ణయించిన హద్దులను పరిశీలించారు. భూహద్దుల నిర్ధారణ తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ వెంట డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీవో సుమ, ల్యాండ్ సర్వే ఏడీ శ్రీనివాసులు, ఇరిగేషన్ ఎస్ ఈ రాం ప్రసాద్, జిల్లా ఆర్ అండ్ బి అధికారి రాజేందర్, తహసీల్దార్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *