Breaking
26 Mar 2026, Thu

రోడ్లు, భవనాల శాఖ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష…

గ్రేటర్ న్యూస్ హైదరాబాద్ : రోడ్లు, భవనాల శాఖ పై బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది . రోడ్ సెక్టార్ పాలసీ-2047 కు అనుగుణంగా రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు .హైదరాబాద్ నుంచి రాష్ట్రంలో ఎక్కడికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల ప్రణాళిక – అభివృద్ధి ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.హైదరాబాద్ ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దడానికి కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధి పై దృష్టిపెట్టాలన్నారు.జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ, రెవెన్యూ విభాగాలతో సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశించారు . జిల్లా కేంద్రాలకు రింగ్ రోడ్ల ఏర్పాటు ప్రతిపాదనలు పరిశీలించాలన్నారు.పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి ప్రతిపాదించిన ఆయా ఆసుపత్రి భవనాల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు ఈ సమీక్షలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *