Breaking
16 Jul 2026, Thu

కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవడం అత్యంత దూర్మార్గం…. డాక్టర్ కాళీ ప్రసాద్ రావు

గ్రేటర్ న్యూస్, పరకాల : కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవడం అత్యంత దూర్మార్గ మని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు అన్నారు. ఈ సందర్బంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ…దేశ చరిత్రలో మహిళా సాధికారత కోసం కేంద్రం లోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం ఆ పార్టీ మహిళా వ్యతిరేక ధోరణికి పరాకాష్ట అని దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్లకు మోక్షం లభిస్తున్న తరుణంలో, కేవలం రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ అడ్డుతగలడం దేశంలోని కోట్లాది మంది మహిళల ఆకాంక్షలను అవమానించడమేనని పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా చట్టసభలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే చారిత్రక అవకాశాన్ని కాంగ్రెస్ కాలరాసిందని, బయట మహిళా హక్కుల గురించి మాట్లాడుతూ పార్లమెంటులో బిల్లును అడ్డుకోవడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని ధ్వజమెత్తారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు దక్కకుండా చేస్తూ దేశ పరిపాలనలో వారి భాగస్వామ్యాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో మహిళా లోకం తగిన బుద్ధి చెబుతుందని డాక్టర్ కాళీ ప్రసాద్ రావు హెచ్చరించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కేంద్ర ప్రభుత్వం మహిళా పక్షపాతంగా తన పోరాటాన్ని కొనసాగిస్తూ, మహిళా రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *