Up to 44°C |
గ్రేటర్ న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టంలో పలు ప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా, మధ్యాహ్నానికి ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40°C నుంచి 45°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రత సుమారు 42°C ఉష్ణోగ్రత నమోదైంది.
దీంతో జనాలు బయట తిరగానికి ఇబ్బందులు పడ్డారు. రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలు అయిన ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో 44°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత కారణంగా రైతులు, కూలీలు తమ పనులు ఉదయం లేదా సాయంత్రం సమయంలోనే చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఎండలు కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని, ఎండదెబ్బకు గురికాకుండా మంచినీరు ఎక్కువగా తాగాలని అధికారులు సూచిస్తున్నారు.

