Breaking
1 Jun 2026, Mon

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్…

గ్రేటర్ న్యూస్, నర్సంపేట : ఆత్మహత్య చేసుకొని మరణించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాన్ని మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.నర్సంపేట నియోజకవర్గం, ముత్తోజిపేటలోని దివంగత శంకర్ గౌడ్ నివాసానికి కేటీఆర్ వెళ్లి ఆయన చిత్ర పటానికి నివాళులర్పించి, బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.ఈ సందర్బంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి ఆవేదనతోనే ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకొని మరణించారని విమర్శించారు.

ఈ సందర్భంగా పార్టీ తరపున వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

ఈ పరామర్శలో మండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *