గ్రేటర్ న్యూస్,హనుమకొండ : ఆధునిక జీవనశైలి, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల కిడ్నీ సమస్యలు పెరుగుతున్న తరుణంలో.. నెఫ్రాలజీ రంగంలో వస్తున్న
సాంకేతిక మార్పులు రోగులకు కొత్త ఆశలు కల్పిస్తున్నాయని ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ప్రణీత్ రామ్ పేర్కొన్నారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్ట యశోద హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిడ్నీ ఆరోగ్య సంరక్షణపై ఆయన పలు కీలక
అంశాలను వెల్లడించారు. ప్రస్తుతం కిడ్నీ సంబంధిత వ్యాధులకు అత్యంత ఆధునిక పద్ధతుల్లో చికిత్స అందుబాటులోకి వచ్చిందని ఆయన వివరించారు. సాధారణ డయాలిసిస్ కంటే ఇది ఎంతో మెరుగైనది.
రక్తంలోని విషపదార్థాలను ఇది మరింత సమర్థవంతంగా తొలగించి, రోగి కోలుకునే వేగాన్ని పెంచుతుంది. ఐసీయూలో అత్యంత విషమ స్థితిలో ఉన్న రోగులకు ఇది
ప్రాణరక్షకగా నిలుస్తుంది. రక్తపోటును స్థిరంగా ఉంచుతూ నిరంతరంగా డయాలిసిస్ అందించడం దీని ప్రత్యేకత. గతంలో ఒకే రక్త గ్రూప్ ఉన్న వారి మధ్యే కిడ్నీ మార్పిడి
జరిగేది. కానీ ఇప్పుడు ‘ఏబీఓ అసమాన ట్రానా పాంటేషన్’ ద్వారా భిన్న రక్త గ్రూపులు దాతల నుంచి కూడా సురక్షితంగా కిడ్నీ మార్పిడి చేయవచ్చు. కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ ప్రణీత్ రామ్ సూచించారు. ముఖ్యంగా మధుమేహం (షుగర్), రక్తపోటు (బీపీ) ఉన్నవారు తరచూ
కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే మందులతోనే నియంత్రించవచ్చని. చేసే తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించాలని కోరారు. సికింద్రాబాద్ లోని
యశోద ఆసుపత్రిలో ఇలాంటి అత్యాధునిక సాంకేతికతతో కూడిన వైద్య సేవలు, అనుభవజ్ఞులైన వైద్య బృందం అందుబాటులో ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో నరేష్, రాజ్ కుమార్, స్వరాజ్, సిబ్బంది పాల్గొన్నారు.
కిడ్నీ ఆరోగ్యం కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత :నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ప్రణీత్ రామ్….

