గ్రేటర్ న్యూస్,హనుమకొండ: మేడారం మహాజాతర సందర్భంగా ఈ నెల 30వ తేదీ (శుక్రవారం) జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవును ప్రకటించినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం ప్రకటనలో తెలిపారు.
ప్రకటించిన సెలవుకు బదులుగా ఫిబ్రవరి 14వ తేదీ (రెండవ శనివారం)ను పనిదినంగా పరిగణించనున్నట్లు పేర్కొన్నారు. విద్యా సంస్థల యాజమాన్యాలు ఈ విషయాన్ని గమనించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.

