ఐదు నిమిషాలు ఆలస్యమైన పరీక్ష హలులోకి అనుమతి..
గ్రేటర్ న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి.ఈ క్రమంలో విద్యార్థులకు రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (TG BIE) భారీ ఊరటనిచ్చింది. సాధారణంగా హాల్ టికెట్ పై కళాశాల ప్రిన్సిపాల్ సంతకం తప్పనిసరి అనే నిబంధన ఉన్నప్పటికీ,ఈసారి విద్యార్థులు ఆన్లైన్ నుండి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై సంతకం లేకపోయినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.కాగా ఉదయం 09:05(ఐదు నిమిషాలు ఆలస్యం ఐనా పరీక్ష హలులోకి అనుమతిస్తామని తెలిపారు. అయితే అరగంటముందే పరీక్ష కేంద్రానికి విద్యార్థులు చేరుకోవాలని సూచించారు.

