Breaking
26 Mar 2026, Thu

ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణం త్వరిత గతిన పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్…


గ్రేటర్ న్యూస్, ములుగు : ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణం పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టర్ ఇంచర్ల శివారు లోని ఎర్రి గట్టమ్మ వద్ద నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ భవన నిర్మాణ పనులు అత్యంత నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎలక్ట్రిసిటీ, ఫ్లోరింగ్, పెయింటింగ్ తదితర పనులను వేగంగా పూర్తి చేయాలని నిర్మాణ పనులలో నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ అజయ్ కుమార్, డి ఈ లింగ రెడ్డి, గుత్తేదారు కృష్ణ , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *